
ఆకట్టుకుంటున్న థాయిలాండ్ షాపింగ్ ఫెస్టివల్
కొమ్మాది: రుషికొండ సమీపంలోని రాడిసన్ బ్లూలో నిర్వహిస్తున్న థాయిలాండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్టివల్, ఫర్నిచర్, హోమ్ డెకర్ ఎక్స్‌పోకు విశేషమైన స్పందన లభిస్తోంది. అంతర్జాతీయ ఉత్పత్తులు, హస్తకళలు, గృహోపకరణాలు, డిజైన్లకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు ఒకేచోట అందుబాటులో ఉండటంతో వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎక్స్‌పోలో థాయిలాండ్, కొరియా, ఆఫ్ఘనిస్థాన్, యూఏఈ, ఇరాన్, సింగపూర్, లెబనాన్, మలేసియా వంటి దేశాలకు సంబంధించిన ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. థాయిలాండ్ ముత్యాల ఆభరణాలు, సింగపూర్, కొరియా బ్యాగులు, దుబాయ్ ప్రీమియం పెర్ఫ్యూమ్స్, చాక్లెట్లు, ఆఫ్ఘనిస్థాన్ డ్రైఫ్రూట్స్, ఇరాన్ ఆభరణాలు, మిఠాయిలు, మలేసియా స్టైలిష్ అవుట్‌డోర్ ఫర్నిచర్ వంటి ప్రత్యేక ఉత్పత్తులు ఇక్కడ లభిస్తున్నాయి. ఈ ప్రదర్శన మరో మూడు రోజులు మాత్రమే ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్న వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.