
గతంలో సభ్యులందరి సమన్వయంతో..
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుండటం బాధాకరం. గతంలో విశాఖ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని కౌన్సిల్‌లోని అన్ని పార్టీల (వైఎస్సార్ సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐ) సభ్యులను సమన్వయపరచి, తీర్మానం చేసి అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాం. అది కేంద్రానికి చేరింది. ఇప్పుడు ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సభ్యులందర్నీ సమన్వయపరచి ప్రభుత్వానికి తీర్మానం పంపడంలో ఎందుకు ఆలోచిస్తున్నారు? దాదాపు ఈ విషయాన్ని రెండు గంటల పాటు నాన్చడంలో అర్థమేంటి?
– గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మేయర్