
16వ బెటాలియన్ కమాండెంట్‌గా అరుణ్
పీఎంపాలెం : ఏపీఎస్‌పీ 16వ బెటాలియన్‌కు నూతన కమాండెంట్‌గా ఎం. అరుణ్ బోస్ నియమితులయ్యారు. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు నెల్లూరులోని వెంకటగిరి 9వ పోలీస్ బెటాలియన్‌లో అడిషనల్ కమాండెంట్‌గా పనిచేసిన ఆయన, కమాండెంట్‌గా పదోన్నతి పొంది ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెటాలియన్ సిబ్బంది, అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననిచెప్పారు. అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపి, స్వాగతం పలికారు. బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ ఎం. శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమాండెంట్లు పి. సత్యం, ఎన్. మురళీధర్, జి. ఇలియాసాగర్, వి. నారాయణరావు పాల్గొన్నారు.