
అక్కడ రూ.147.. కానీ.. ఇక్కడ మాత్రం రూ.377
దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ బెడ్‌షీట్లను కాన్పూర్‌కి చెందిన సహకారి సమితి లిమిటెడ్ వద్ద కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దాదాపు రూ.7.86 కోట్లతో 2,54,657 బెడ్‌షీట్లను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈస్ట్‌కోస్ట్‌రైల్వే రూ.141.75కి కొనుగోలు చెయ్యగా.. ఈస్ట్రన్ రైల్వే జోన్ రూ.189 వెచ్చించారు. కానీ దక్షిణ మధ్య రైల్వే మాత్రం 2023లో ఏకంగా రూ.377 కి కొనుగోలు చేసింది. దీనిపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. అయినా అదే కుంభకోణం మరోసారి జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని రైల్వే జోన్లు అధిక ధరకు ఈ బెడ్‌షీట్లను కొనుగోలు చేసి భారీగానే లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెట్టింపు కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చెయ్యాల్సిన అవసరం ఏముందనే అంశంపై సీబీఐ ఆరా తీస్తోంది. ఇప్పటికే అన్ని జోన్లలో గత ఐదేళ్ల కాలంలో బెడ్‌షీట్లను ఎంత ధరకు కొనుగోలు చేశారు..ఎందుకు కొనుగోలు చేశారనే ఫైళ్లని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రైల్వే జోన్లు దాదాపు 63 శాతం అధిక ధరను బెడ్‌షీట్ల కోసం వెచ్చించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతోందని తెలియడంతో ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌లోనూ కలకలం మొదలైంది. మొత్తంగా ఈ బెడ్‌షీట్ల కుంభకోణం బట్టబయలైతే.. దాదాపు 10 జోన్లలో ఉన్నతాధికారులు ఇందులో చిక్కుకునే అవకాశం ఉందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.