
పెరిగిన మేహాద్రి నీటిమట్టం!
ప్రస్తుతం 55.3 అడుగులకు చేరిక
పెందుర్తి: నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో మేహాద్రి రిజర్వాయర్ నిండుకుండలా మారింది. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల నుంచి వర్షపు నీరు ఉధృతంగా వస్తుండటంతో గంటగంటకు మేహాద్రి నీటిమట్టం పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి అది 55.3/61 అడుగులకు చేరుకుంది. వారం రోజుల కిందట వరకు దాదాపుగా ఎండిపోయిన మేహాద్రి.. కేవలం నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో నిండిపోవడం గమనార్హం. మరో మూడు అడుగుల నీటిమట్టం పెరిగితే ఉన్నతాధికారుల సూచనల మేరకు ఒక గేటు ఎత్తే అవకాశాలు ఉన్నట్లు నీటి పారుదల శాఖ వర్క్ ఇన్‌స్పెక్టర్ సుబ్బరాజు తెలిపారు. ఇప్పటికే మేహాద్రి పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు.