కూలిన శ్లాబ్‌.. ఒకరికి గాయం | - | Sakshi
Sakshi News home page

కూలిన శ్లాబ్‌.. ఒకరికి గాయం

Aug 19 2025 6:40 AM | Updated on Aug 19 2025 6:40 AM

కూలిన

కూలిన శ్లాబ్‌.. ఒకరికి గాయం

అల్లిపురం: గత రాత్రి కురిసిన భారీ వర్షానికి జీవీఎంసీ 34వ వార్డు కొబ్బరితోట, ఎస్‌వీపీ నగర్‌లో ఒక ఇంటి పైకప్పు కూలిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఉమ్మిడి గురుమూర్తికి చెందిన ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. తాజాగా కురిసిన భారీ వర్షానికి ఇంటి శ్లాబ్‌ కూలిపోయింది. స్వామి అనే దివ్యాంగుడు గాయపడగా, 80 ఏళ్ల వృద్ధురాలు తప్పించుకుంది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పాడయ్యాయి. ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో జీ+1 కేటగిరీలో స్కీమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరాయి. జోన్‌–4 జెడ్సీ సోమవారం వార్డులో పర్యటించి, ఇళ్లు ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం లేకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కూలిన శ్లాబ్‌.. ఒకరికి గాయం 
1
1/1

కూలిన శ్లాబ్‌.. ఒకరికి గాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement