
విశాఖపట్నం : బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో యువతీ యువకులు దుర్మరణం చెందారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో చంద్రంపాలెం జెడ్పీ హైసూ్కల్ ఎదురుగా హైవేపై చోటుచేసుకున్న ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు. నగర పరిధిలోని జోడుగుళ్లపాలేనికి చెందిన వాసుపల్లి దాసుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వాసుపల్లి సతీష్ (19) భవన నిర్మాణ సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అప్పుడప్పుడు చేపలుప్పాడ లో ఉంటున్న తాతగారి ఇంటికి వెళ్తుంటాడు. పలాస కు చెందిన ఉష(18)తో యువకుడికి పరిచయం ఉంది.
తనను కలుసుకోవడానికి వచ్చిన ఆమెతో బైక్‌పై పలు ప్రాంతాల్లో తిరిగారు. ఈ క్రమంలో తాతగారి ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు వీరిద్దరూ బైక్‌పై పరదేశిపాలెం మీదుగా బయల్దేరారు. చంద్రంపాలెం హైసూ్కల్ ఎదురుగా హైవేపైకి వచ్చేసరికి ముందు వెళ్తున్న బస్సు, లారీలను తప్పించబోయి లారీకి బైక్ తగలడంతో కింద పడిపోయారు. ఇద్దరికీ తలకు బలమైన గాయాలై సంఘటనా స్థలిలోనే మరణించారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ రాము తెలిపారు.