
కూటమి శకటాల్లో వైఎస్సార్ సీపీ ముద్ర
జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలోని ప్రగతిని తెలియజేస్తూ ఎనిమిది శకటాల ప్రదర్శన నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర ఉద్దేశాలను తెలుపుతూ జీవీఎంసీ, భవిష్యత్తు విశాఖ కోసం సుస్థిరమైన మౌలిక వసతుల అభివృద్ధి అనే థీమ్‌తో వీఎంఆర్డీఏ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, తల్లికి వందనం పథకాన్ని వివరిస్తూ విద్యాశాఖ, నా ఆరోగ్యం–నా హక్కు అనే అంశంతో వైద్యారోగ్య శాఖ, ఎన్టీఆర్ పేదలందరికీ ఇళ్లు పథకంపై గృహ నిర్మాణ శాఖ, పేదరికం రహితం–పీ4 విధానం పేరుతో ప్రణాళికా విభాగం, పీఎం సూర్యఘర్ ఆవశ్యకతను తెలుపుతూ ఈపీడీసీఎల్ శకటాలను ప్రదర్శించాయి. వీటిలో గృహ నిర్మాణ శాఖ శకటానికి ప్రథమ స్థానం దక్కింది. రెండో స్థానంలో జీవీఎంసీ, మూడో స్థానంలో సమగ్ర శిక్ష, విద్యాశాఖలు సంయుక్తంగా నిలిచాయి. పీఎం సూర్యఘర్ అంశాన్ని వివరిస్తూ ఏపీడీసీఎల్ ఏర్పాటు చేసిన శకటానికి ప్రోత్సాహక బహుమతి లభించింది. ఆయా శాఖల అధికారులను అభినందిస్తూ రెవెన్యూ మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. కాగా.. ఈ శకటాల్లో ప్రదర్శించిన చాలా అభివృద్ధి పనులు.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేపట్టినవే కావడం విశేషం. ముఖ్యంగా జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, గృహ నిర్మాణ శాఖ శకటాల్లో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి స్పష్టం కనిపించింది.

కూటమి శకటాల్లో వైఎస్సార్ సీపీ ముద్ర

కూటమి శకటాల్లో వైఎస్సార్ సీపీ ముద్ర