
అప్పన్న ఆలయం పైభాగంలో శ్లాబ్‌ని పరిశీలిస్తున్న ప్రొఫెసర్ ప్రశాంత్
సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయం శ్లాబ్ లీకులపై సోమవారం తిరుపతికి చెందిన ఐఐటీ ప్రొఫెసర్ ప్రశాంత్ అధ్యయనం చేశారు. వర్షం పడితే ఆలయ పైభాగం నుంచి నీరు కారుతోంది. ఈ పరిస్థితిని నివారించేందుకు దేవస్థానం అధికారులు ప్రొఫెసర్ ప్రశాంత్‌ని సంప్రదించారు. ఈ మేరకు ఆయన సింహగిరికి వచ్చి దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆలయ పైభాగాన్ని పరిశీలించారు. డ్రిల్లింగ్ మిషన్‌తో పలు చోట్ల శ్లాబ్ ముక్కలను కట్ చేసి తిరుపతికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించిన తర్వాత నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం నివారణ చర్యలు ప్రారంభించనున్నారు. దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు, ఏఈ బాబ్జీ, తదితరులు పాల్గొన్నారు.