కౌన్సిలర్ పట్లోళ్ల దీప
తాండూరు టౌన్: గోవుల కోసం వేసిన షెడ్లను మున్సిపల్ అధికారులు కూల్చి వేయడం అమానుషమని 9వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ పట్లోళ్ల దీప అన్నారు. రైతులు మూగ జీవాల సంరక్షణ కోసం వేసుకున్న షెడ్లను మున్సిపల్ సిబ్బంది అక్రమంగా కూల్చేశారన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదనే అక్కసుతోనే ఆ పార్టీ నాయకుల ఒత్తిడితో రైతుల షెడ్లు కూల్చేశారని ఆరోపించారు. పట్టణంలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు భయపడుతున్న అధికారులు, పేదల షెడ్లను కూల్చడంలో మాత్రం ముందు వరుసలో ఉంటున్నారన్నారు. కక్ష పూరితంగా ప్రతీకార చర్యలకు పాల్పడితే ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు.


