అనంతగిరి: వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ కాపాడుకుందామని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని 17వ వార్డులో పీసీసీఎఫ్, సెఫ్‌నార్మ్ డీజీ డాక్టర్ రత్నాకర్ జౌహరి, ఎస్పీ స్నేహమెహ్ర, మున్సిపల్ చైర్‌పర్సన్ అనన్యతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలకు పూర్తి చేయాలని ఆదేశించారు. మొక్కలను నాటడంతో పాటు, వాటిన సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. వన మహోత్సవంలో ప్రజలు, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలను భాగస్వామ్యం చేయాలన్నారు. అనంతరం పీసీసీఎఫ్ డాక్టర్ రత్నాకర్ మాట్లాడుతూ.. విరివిగా మొక్కలు నాటి పర్యావరణ హితానికి పూనుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి విశాల్ బత్తుల, మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి, మాజీ చైర్మన్ సత్యనారాయణ, కౌన్సిలర్లు విశ్వనాథం రాఘవేందర్, అనంత్‌రెడ్డి, జ్యోతి, విజయలక్ష్మి, కడియాల వేణుగోపాల్, పాండు, మల్లికార్జున్ గౌడ్, అనిల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పరిహారం చెల్లింపు వేగిరం చేయండి
సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణంలో భాగంగా రైతుల నుంచి సేకరించిన భూములకు పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. మంగళవారం నగరం నుంచి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణం కోసం సేకరించిన భూ యజమానులకు పరిహారం, పునరావాసం కల్పించడం, అటవీ శాఖ అనుమతులకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, జిల్లా వ్యవసాయాధికారి కవిత, సీపీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పర్యాటక అభివృద్ధికి కృషి
జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం నగరం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పర్యాటక రంగ అభివృద్ధి, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగుపై సూచనలు చేశారు. చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి కవిత, సీపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
వనమహోత్సవ లక్ష్యాలను పూర్తి చేయాలి
కలెక్టర్ దీపక్ తివారి


