టీపీఎస్‌ విద్యార్థులకు 22వరకు శిక్షణ తరగతులు | - | Sakshi
Sakshi News home page

టీపీఎస్‌ విద్యార్థులకు 22వరకు శిక్షణ తరగతులు

Aug 18 2026 9:08 AM | Updated on Aug 18 2026 9:08 AM

టీపీఎస్‌ విద్యార్థులకు 22వరకు శిక్షణ తరగతులు

మంచాల: మండల పరిధిలోని తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌(టీపీఎస్‌) ఆరుట్ల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఓయూ అధ్యాపకురాలు మాధవి తెలిపారు. సోమవారం పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 22వరకు ఇంగ్లిష్‌ నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ సామర్థ్యాలు, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఉంటుందని చెప్పారు. ఉన్నత విద్య అభ్యసించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచన లు, సలహాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుడు జితేందర్‌ నాయక్‌, హెచ్‌ఎం గిరిధర్‌గౌడ్‌, ఎంఈఓ రాందాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement