చోరీ సొత్తు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

చోరీ సొత్తు స్వాధీనం

Aug 18 2026 9:08 AM | Updated on Aug 18 2026 9:08 AM

వేడుకగా ‘మహా కావడ్‌’

నిందితుడి అరెస్ట్‌ రిమాండ్‌కు తరలింపు

మోమిన్‌పేట: ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మోమిన్‌పేట ఎస్‌ఐ భరత్‌భూషణ్‌ సోమవారం తెలిపారు. మండలంలోని మేకవనంపల్లికి చెందిన సుభాష్‌గౌడ్‌ ఇంట్లో ఈ నెల 15న దొంగతనం జరిగింది. అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడి బీరువాలోని ఆరు తులాల బంగారు ఆభరణాలు, రెండు సెల్‌ ఫోన్లు ఎత్తుకెళ్లారు. సుభాష్‌గౌడ్‌ ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా లచ్చానాయక్‌ తండాకు చెందిన విస్లవత్‌ కిరణ్‌ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. అతన్ని ఆదుపులోకి తీసుకొని చోరీ సొత్తు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓపై ఫిర్యాదు

బొంరాస్‌పేట: ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ వెంకన్‌గౌడ్‌పై మండలంలోని కొత్తూరు పంచాయతీ కార్యదర్శి సోమవారం పోలీసులకు ఫిద్యారు చేశారు. రెండేళ్లుగా తనను మానసికంగా, శారీరకంగా క్షోభకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, పూర్తిస్థాయి విచారణ చేయాలని కోరారు. ఆమెతో పాటు పలువురు కార్యదర్శులు స్టేషన్‌కు వెళ్లి మద్దతు తెలిపారు. ఈ విషయమై వెంకన్‌గౌడ్‌ను వివరణ కోరగా విధులు సక్రమంగా నిర్వహించాలని చెప్పినందుకే తనపై లేనిపోని ఆరోపణలు, ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఇండస్ట్రియల్‌కు భూములివ్వం

తేల్చిచెప్పిన కొండాయపల్లి రైతులు

దోమ: ఇండస్ట్రియల్‌ పార్క్‌కు భూములిచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని కొండాయపల్లి గ్రామంలో ఆర్డీఓ వాసుచంద్ర ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామానికి చెందిన 252 మంది రైతుల పట్టా భూములు 371.24 గుంటలు, లావణి పట్టా భూములు 85.03 గుంటలు ఇండస్ట్రియల్‌ పార్క్‌కు సేకరించనున్నారు. 152 మంది రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించగా వంద మంది నిరాకరించారు. తమ ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వబోమని వారు తెల్చి చెప్పారు.

గులాబీ శ్రేణుల్లో జోష్‌..

తాండూరు: మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పలు వివాదాల నేపథ్యంలో తాండూరుకు దూరంగా ఉన్న పైలెట్‌.. 6 నెలల తర్వాత పట్టణంలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయన రాకతో నియోజకవర్గ గులాబీ శ్రేణులు, అభిమానులు వేలాది మంది తరలి వచ్చారు. భారీ గజమాలతో స్వాగతం పలికారు.

హూడాకాంప్లెక్స్‌: భాగ్యనగర్‌ కావడ్‌ సేవా సంఘం ఆధ్వర్యంలో 29వ మహా కావడ్‌ యాత్ర–2026 భక్తి ప్రపత్తులతో కొనసాగింది. చార్మినార్‌ ముహాదేవ ఆలయం నుంచి వేలాది మంది భక్తులతో సోమవారం సరూర్‌నగర్‌ ఉమా మహేశ్వర స్వామి ఆలయానికి చేరకుంది. అనంతరం స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు.

పార్క్‌ చేసిన ఆటోకు నిప్పు

మీర్‌పేట: పార్కింగ్‌ చేసిన ఆటోకు నిప్పంటించిన సంఘటన మీర్‌పేట ఠాణా పరిధిలో చో టు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జిల్లెలగూడ డీఎన్‌ఆర్‌కాలనీకి చెందిన రమావత్‌ చందు ఆటోడ్రైవర్‌. సోమవారం తెల్లవారుజామున ఇంటి ముందు పార్కు చేసిన ఆటోకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేశారు. పా త గొడవల కారణంగా తన అన్న అల్లుడు కిష న్‌ ఆటోకు నిప్పు పెట్టి ఉంటాడని బాధితుడు చందు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలిలో పెట్రోల్‌ బాటిల్‌ లభ్యమైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement