కందుకూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీని సోమవారం ఢిల్లీ, దక్షిణ కొరియా ప్రతినిధి బృందాలు సందర్శించాయి. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మంజిందర్‌సింగ్ సిర్సా నేతృత్వంలో సీనియర్ అధికారులు సజ్జన్‌సింగ్‌యాదవ్, సౌమ్య సౌరభ్, నాజుక్‌నాయక్, రాజేష్‌చౌదరి బృందం ఫ్యూచర్‌సిటీతో పాటు ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి లక్ష్యాలు, సమగ్ర మాస్టర్ ప్లాన్, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడులు, భవిష్యత్‌లో ఏర్పాటు చేయనున్న వివిధ రంగాలపై ఎఫ్‌సీడీఏ అధికారులు ప్రతినిధి బృందానికి వివరించారు. ఫ్యూచర్‌సిటీని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, పెట్టుబడులు, స్థిరమైన పట్టణాభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతున్న విధానం బాగుందని బృందం పేర్కొంది. అంతకుముందు దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌కే గ్రూప్ వ్యాపార ప్రతినిధి బృందం కూడా ఫ్యూచర్‌సిటీని, ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని సందర్శించింది. ఆ గ్రూప్ ప్రెసిడెంట్ జమ్స్‌రాయ్‌తో పాటు సభ్యులు హార్వేకిమ్, అలెగ్జ్‌గో, యూన్‌సుక్‌ఓక్, జైమేపార్క్, యూన్‌లిమ్ బృందంకు ఫ్యూచర్‌సిటీ విజన్, అభివృద్ధి ప్రణాళికలు, సాంకేతిక ఆవిష్కరణల ఎకోసిస్టమ్‌తో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీస్, లైఫ్‌సైన్స్‌స్, అధునాతన పరిశ్రమలు మరియు స్మార్ట్ అర్బన్ డెవలప్‌మెంట్ రంగాల్లో పెట్టుబడులు, భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను అధికారులు వివరించారు. కాగా రెండు ప్రతినిధి బృందాల సందర్శన సందర్భంగా ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి దిశగా చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ మౌలిక వసతుల ప్రణాళికలు, పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న అవకాశాలపై విస్తతంగా చర్చ జరిగింది. కార్యక్రమంలో ఎఫ్‌సీడీఏ అధికారులు పాల్గొన్నారు.
దక్షిణకొరియా, ఢిల్లీ ప్రతినిధుల బృందం కితాబు
ఎఫ్‌సీడీఏ కార్యాలయంలో అధికారులతో సమావేశం


