చేవెళ్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పార్టీ శాసనమండలి సభ్యుడు నెల్లికంటి సత్యం అన్నారు. సీపీఐ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర(బస్సు జాత) సోమవారం పట్టణ కేంద్రం నుంచి ప్రారంభమైంది. ముందుగా ఆయన అంబేడ్కర్, జ్యోతిరావుపూలే విగ్రహాలకు పూలమాలలు వేసి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు, యువత, విద్యార్థులు కార్మికులు, పేదల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడేందుకు ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ.. పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బస్సుజాతను విజయవతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 20న అబ్దుల్లాపూర్‌మెట్‌లో ముగింపు సభ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పానుగంటి పర్వతాలు, కె.రామస్వామి, బద్దుల జంగయ్య, యాద య్య, రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.ప్రభులింగం, శేఖర్‌రెడ్డి, వడ్ల సత్యనారాయణ, యాదగిరి, యాదయ్య, శ్రీదేవి, సుధాకర్, కాంతి, వంశీవర్ధన్‌రెడ్డి, మంజుల, సత్తిరెడ్డి, కె.శ్రీనివాస్, పాలమాకుల శ్రీశైలం, పి.సుధీర్, సుధాకర్‌గౌడ్, మక్బు ల్, చందు, వెంకటస్వామి, మల్లేశ్, అంజయ్య, బాబురావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం అన్నిరంగాల్లో విఫలం: పాలమాకుల
శంకర్‌పల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ఆరోపించారు. సీపీఐ ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రజాచైతన్య యాత్ర సోమవారం శంకర్‌పల్లికి చేరుకుంది. బస్సుజాతకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పట్టణ చౌరస్తా జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యులపై భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి, పేదలకు వైద్యం, మహిళా రిజర్వేషన్, పంటలకు కనీస గిట్టుబాటు ధర, కార్మిక చట్టాల పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి సుధీర్, నాయకులు నర్సింహారావు, జంగయ్య, ప్రభులింగం, రామస్వామి, సత్యనారాయణ, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పనిచేయాలి
సీపీఐ పార్టీ శాసన మండలి సభ్యుడు నెల్లికంటి సత్యం


