● రూ.4.7 లక్షల విలువైన పదార్థాలు ఉత్పత్తులు స్వాధీనం
● ఇద్దరు వ్యాపారులు అరెస్టు
ఇబ్రహీంపట్నం రూరల్: అక్రమంగా ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్న పరిశ్రమపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేసి, ఇద్దరు యజమానులను అరెస్టు చేశారు. రూ.4.7 లక్షల విలువైన ఉత్పత్తులు, ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి శాంశాబాద్ జోన్ కమిషనర్, టాస్క్‌ఫోర్స్ వివరాల ప్రకారం.. బొంగ్లూర్‌లోని కేసెస్‌ఎం ఫుడ్ ప్రోడక్ట్స్ లో అక్రమంగా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారని తెలియడంతో శుక్రవారం రాత్రి దాడులు చేశారు. కాలం చెల్లిన ముడిపదార్థాలు, లేబుల్ లేని ప్లేవర్లు, ఆహార ఉత్పత్తులను గుర్తించారు. ఇక్కడ అపరిశుభ్రమైన పరిస్థితులు ఉన్నట్లు బృందం గుర్తించింది. సోన్‌పాపడ్, పల్లీపట్టి, చిక్కిబెల్లం, మైదా, ప్లేవర్లు, ఇతర పదార్థాలతో సహా సూమారు రూ.4.7 లక్షల విలువైన ఆహార ఉత్పత్తులు, ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. యజమానులు మహ్మద్ ఖలీద్(38), సంతోష్ కుమార్ (44)ను అరెస్టు చేశారు. దాడిలో హెచ్‌ఫాస్ట్ బృందం జీహెచ్‌ఎంసీ అహార భద్రత అధికారి రాకేశ్, శంషాబాద్ జోన్ టాస్క్‌పోర్స్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ డి.కృష్ణమోహన్, ఎస్‌ఐలు మన్సూర్‌అలీ, సిబ్బంది పాల్గొన్నారు.


