మూసాపేట: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సైకిళ్లకు జాతీయ జెండా అమర్చి 26 కిలోమీటర్ల భారీ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ‘పెడల్ విత్ ప్రైడ్’ పేరుతో కూకట్‌పల్లి లులు మాల్ ఆధ్వర్యంలో ఇండియన్ ఆర్మీ, హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ సౌజన్యంతో ‘సాక్షి మీడియా పార్టనర్‌గా 300 మంది సైక్లిస్టులతో వార్ మెమోరియల్ బొల్లారం నుంచి కేపీహెచ్‌బీ కాలనీలోని లులు మాల్ వరకు శనివారం భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రిటైర్డ్ ఆర్మీ అధికారి ర్యాలీని ప్రారంభించారు. లెఫ్టినెంట్ కల్నల్ కృష్ణమూర్తి ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. మాల్ మేనేజర్ అజిల్ అరసన్, డీజీఎం విశాల్, హెచ్‌సిజి ఫౌండర్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.


