బొంరాస్‌పేట: ప్రతిభగల విద్యార్థులకు దాతలు ఆర్థిక సహాయం అందజేశారు. బురాన్‌పూర్‌సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి తరగతుల వారీగా రూ.9 వేల నగదు అందజేశారు. తుంకిమెట్లలో మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండీ అనిఫ్ రూ వెయ్యి, పాఠశాల అభివృద్ధికి మద్దూరు రాజు రూ.5 వేలు, ఉప సర్పంచ్ ఆనంద్ రూ.5 వేలు, బెస్తరాజు రూ.2 వేలు, అంజిల్‌రెడ్డి రూ.2 వేలు విరాళంగా అందజేశారు. బొంరాస్‌పేట సర్పంచ్ వీరేశం రూ.7,500, 1997 పదో తరగతి పూర్వ విద్యార్థుల బృందం మైత్రి సేవా ఫౌండేషన్ వారు రూ.45 వేలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. చదువులోరాణించాలని ఆకాంక్షించారు. ఇందులో ఎంఈఓ హరిలాల్, హెచ్‌ఎంలు ఎండీ మీరజ్, భద్రయ్యలున్నారు.
దుద్యాలలో..
హైదరాబాద్‌లో ఏసీపీగా పని చేస్తున్న దుద్యాల మండల కేంద్రానికి చెందిన సర్దార్‌సింగ్.. కుమారుడు కౌశల్‌సింగ్ జ్ఞాపకార్థంగా రూ.25 వేలను పదిలో మండల టాపర్‌గా నిలిచిన పోల్కంపల్లితండాకు చెందిన రాథోడ్ మౌనికకు ఆర్థికసాయం ప్రటించారు. సంబంధిత చెక్కును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్, కాంప్లెక్స్ హెచ్‌ఎం మల్లప్ప, మేర్గు వెంకటయ్యలు విద్యార్థినికి అందజేశారు. ఆవుటి శేఖర్ రూ.5 వేల నగదు అందించారు. ఇందులో సర్పంచ్ సంగీతవాణి, ఏఏపీసీ చైర్మన్ గోవిందమ్మలు పాల్గొన్నారు.


