అనంతగిరి: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. వికారాబాద్ మండలం సిద్దులూర్ జెడ్పీహెచ్‌ఎస్ జీహెచ్‌ఎం రామకృష్ణారెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం శుక్రవారం పట్టణంలోని కొండా బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ తప్పదన్నారు. విధి నిర్వహణలో మనం చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. రామకృష్ణారెడ్డి ఎక్కడ విధులు నిర్వహించినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. విద్యార్థులతో మమేకమై విద్యాబుద్ధులు నేర్పించారని కొనియాడారు. అనంతరం ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు కడియాల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి అమర్‌నాథ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ సుధాకర్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్, సీనియర్ నాయకులు కిషన్‌నాయక్, ఎండీ హఫీజ్, సిద్దులూర్ సర్పంచ్ శ్రీనివాస్, కౌన్సిలర్లు బాదం అనురాధ అశోక్, రమ్య శ్రీకాంత్, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్ ప్రసాద్‌కుమార్


