ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

Aug 1 2026 7:46 AM | Updated on Aug 1 2026 7:46 AM

ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి అమెరికా పర్యటనలో ఎమ్మెల్యే బీఎమ్మార్‌

ఎస్సీ కార్పొరేషన్‌

మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి

పరిగి: తెలంగాణ ఉద్యమకారుల రెండు తరాల అపూర్వ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సమ్మేళనం వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 16న నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారుల న్యాయమైన హక్కులు, సంక్షేమ ప్రయోజనాలు అందేలా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించడం స్వాగతిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు నక్క రమేష్‌, సురేష్‌, రహీం, పీర్‌మహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

తాండూరు: మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. పది రోజుల పాటు వర్జీనియా రాష్ట్రంలో పర్యటించనున్నారు. లీస్‌బర్గ్‌లోని స్టోన్‌ టవర్‌ వైనరీని పరిశీలించారు. వైనరీల తయారీ విధానం, ప్రక్రియను నిశితంగా పరిశీలించారు.

జర్నలిస్టుల సమస్యలపై నిరంతర పోరాటం

టీయూడబ్ల్యూజే రాష్ట్ర

ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్‌

అనంతగిరి: జర్నలిస్టుల సమస్యలు, ఇళ్ల స్థలా ల సాధన కోసం తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌(హెచ్‌143) ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం సాగిస్తామని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చి న హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయా లని డిమాండ్‌ చేశారు. శుక్రవారం వికారాబాద్‌లో జిల్లా అడహక్‌ కమిటీ సన్నాహక సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాల కేటాయించాలన్నారు. అనంతరం టీయూడబ్ల్యూజే జిల్లా నూతన అడహక్‌ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్‌గా ఎం.రవీందర్‌, కోకన్వీనర్లుగా ప్రహ్లాదాచారి, శ్రీనివాస్‌, నర్సింలు, ఆనంద్‌, జావీద్‌, రాజు, బస్వరాజ్‌, సంతోష్‌, మల్కయ్య గౌడ్‌, కృష్ణ, రాజేందర్‌ గౌడ్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాఽ దికారి యేగానంద్‌, జాతీయ కౌన్సిల్‌ స భ్యుడు తిరుపతినాయక్‌, కన్వీనర్‌ ఆసీఫ్‌ హు స్సేన్‌, జిల్లా నాయకులు రవీందర్‌, ఆసీఫ్‌ ప్రహ్లాదాచారి, శ్రీనివాస్‌, నర్సింలు, ఆనంద్‌, జావీద్‌, రాజు, బస్వరాజ్‌, సంతోష్‌, మల్కయ్య గౌడ్‌, కృష్ణ పాల్గొన్నారు.

ఘన సన్మానం

అనంతగిరి: విధి నిర్వహణలో మనం చేసిన సే వలే చిరకాలం నిలిచిపోతాయని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. ఉద్యోగ విరమణ పొందన చంగోముల ఎస్‌ఐ చంద్రయ్య, డీసీఆర్‌బీ ఎస్‌ఐ అబ్దుల్‌ గఫార్‌, బషీరాబాద్‌ ఏఎస్‌ఐ చంద్ర శేఖర్‌, నవాబ్‌పేట్‌ పీఎస్‌ కానిస్టేబుల్‌ ఇర్షాద్‌ అలీని శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement