ఆయిల్‌ పామ్‌తో స్థిర ఆదాయం | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ పామ్‌తో స్థిర ఆదాయం

Aug 1 2026 7:46 AM | Updated on Aug 1 2026 7:46 AM

చేరువైన దూరవిద్య! చదువు మానేసి, చదువుకోవాలన్న ఆసక్తి ఉన్న వారికి తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా దూరవిద్య అందనుంది. 8లోu 9లోu

చేరువైన దూరవిద్య! చదువు మానేసి, చదువుకోవాలన్న ఆసక్తి ఉన్న వారికి తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా దూరవిద్య అందనుంది.

రైతులు మొగ్గు చూపాలి

త్వరలో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ

కలెక్టర్‌ దీపక్‌ తివారి

పరిగి: ఆయిల్‌ పామ్‌ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చని, రైతులు మొగ్గు చూపాలని కలెక్టర్‌ దీపక్‌ సూచించారు. శుక్రవారం మండలంలోని సుల్తాన్‌పూర్‌ తండాలో సాగు చేస్తున్న ఆయిల్‌ పామ్‌ తోటను, అంతర పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించాలన్నారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రభుత్వం అనేక సబ్సిడీలు అందజేస్తోందని తెలిపారు. త్వరలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరిగి మండలంలో వెయ్యి ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖ అధికారుల సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌(ట్రైయినీ) సచిన్‌ బస్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

సుడిగాలి పర్యటన

బొంరాస్‌పేట: మండలంలో శుక్రవారం కలెక్టర్‌ దీపక్‌ తివారి పర్యటించారు. బొంరాస్‌పేట్‌ పీహెచ్‌సీ, ఆశ్రమ పాఠశాల, పూరిళ్లను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. బొట్లోనితండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. వంటలను తనిఖీ చేశారు. భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల నూతన భవన నిర్మాణం కోసం తుంకిమెట్ల శివారులో గల రెండు ఎకరాల భూమిని కేటాయించాలని తహసీల్దార్‌ పద్మావతికి సూచించారు. నాగిరెడ్డిపల్లిలో పూరింట్లో ఉన్న వారిని పలకరించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌రెడ్డి, డీటీడీఓ జనార్దన్‌, ఇంచార్జ్‌ ఎంపీడీఓ వెంకన్‌గౌడ్‌, వైద్యాధికారి హేమంత్‌కుమార్‌, హెచ్‌ఎం విక్రమంసింగ్‌, వార్డన్‌ రాజన్న తదితరులు పాల్గొన్నారు.

పనుల్లో వేగం పెంచండి

దుద్యాల్‌: హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి ఆదేశించారు. శుక్రవారం ఎస్సీ స్నేహమెహ్రతో కలసి ఎడ్యుకేషన్‌ హబ్‌లో పర్యటించారు. నర్సింగ్‌ కళాశాల, పార మెడికల్‌, ఫిజియోతెరపీ, వెటర్నరీ హాస్పిటల్‌, మెడికల్‌ కళాశాల, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ భవన నిర్మాణాలపై ఆరా తీశారు. ప్రస్తుతం ఉన్న వనరులు సరిపోకుంటే మరిన్ని యంత్రాలు సమకూర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు కంటే ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌(ట్రైయినీ) సచిన్‌ బస్వరాజ్‌ గుట్టూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement