● సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● రోగులకు మెరుగైన వైద్యం అందాలి
● డీఎంహెచ్‌ఓ సుధాకర్ లాల్
దోమ: పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రికార్డులు, ఆస్పత్రి గదులను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలో పెరిగిన గడ్డిని సిబ్బందితో కలిసి తొలగించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడం మన బాధ్యత అని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి రజిత, సర్పంచ్ మాలిష్ శివకుమార్ రెడ్డి, హెచ్‌ఈఓ ప్రభులింగం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆకస్మిక తనిఖీ
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని స్కైలార్క్ డయాగ్నస్టిక్స్ సెంటర్‌ను జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్ శుక్రవారం తనిఖీ చేశారు. ప్రయోగశాల, మౌలిక వసతులు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.


