ఏర్పేడు: 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు శనివారం ఏర్పేడు మండలం, జంగాలపల్లి వద్దనున్న తిరుపతి ఐసర్, ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐసర్‌లో ఘనంగా నిర్వహించారు. తిరుపతి ఐసర్‌లో డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య మువ్వన్నెల జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవలందించిన ఐసర్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఐసర్ రిజిస్ట్రార్ కోహ్లీ, సిబ్బంది పాల్గొన్నారు.
ఐఐటీలో..
తిరుపతి ఐఐటీలో డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. మార్చ్ పరేడ్ ఆకట్టుకుంది. ఐఐటీ ప్రాంగణంలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో ప్రిన్సిపల్ నీరజ్‌కుమార్ శ్రీవాత్సవ, సిబ్బంది పాల్గొన్నారు.


