తిరుపతి మంగళం:తిరుపతి నుంచి తమిళనాడులో ని తిరువణ్ణామలై వరకు రహదారిని మరింత అభి వృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని ఎంపీ గురుమూర్తి కోరారు. బుధవారం న్యూఢిల్లీలో ఈ మేరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, తిరువణ్ణామలై ఎంపీ అన్నా దొరతో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందించారు. తిరుపతి, కాణిపాకం, వేలూ రు, తిరువణ్ణామలై వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే భక్తులకు ఈ మార్గం ఎంతో ముఖ్యమైనదని కేంద్ర మంత్రికి వివరించారు. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని రహదారిని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరముందని కోరారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించి నట్లు ఎంపీ గురుమూర్తి తెలిపారు.


