తిరుపతి కల్చరల్: భారతీయ కళల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్య తగా తీసుకోవాల ని పలువురు వక్త లు పిలుపునిచ్చా రు. టీటీడీ, హిందూ ధర్మప్రచార పరిషత్ సౌజన్యంతో శ్రీవేంకటేశ్వర నాట్య కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 3వ తేదీ నుంచి పది రోజు ల పాటు మహతి కళాక్షేత్రంలో ప్రదర్శించిన జాతీయ స్థాయి నాట క పోటీలు బుధవారం రాత్రితో ఘనంగా ముగిశాయి. గరుడ అవా ర్డు ప్రధానోత్సవానికి టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, టీటీడీ చీఫ్ పీఆర్‌వో టి.రవి, అభినయ ఆర్ట్స్ కార్యదర్శి బీఎన్.రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కస్తూర్భా గాందీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పీసీ.రాయులు, రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్‌రెడ్డి, కుమారస్వామిరెడ్డి, పరిషత్ అధ్యక్షుడు గజేంద్ర, కార్యదర్శి కొత్తపల్లి మునిరత్నం హాజరయ్యారు. నాటక పోటీలలో విజేతలను న్యాయ నిర్ణేతలు ప్రకటించి బహుమతులు ప్రదానం చేశారు.
ఉత్తమ ప్రదర్శనగా రుద్రమదేవి
పౌరాణిక పద్యనాటక విభాగంలో వరంగల్ కాకతీయ నాటక కళా పరిషత్‌వారు ప్రదర్శించిన ‘మహా రాణి రుద్రమదేవి’ పౌరాణిక పద్యనాటకం ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. షీల్డుతో పాటు రూ. 80వేల నగదు బహుమతి, గరుడ అవార్డును కై వశం చేసుకుంది. అలాగే కర్నూల్ ఈజీవీ.కళా క్షేత్రం వారు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణ కమలపాలిక’ పద్యనాటకం ద్వితీయ స్థానంతో రూ. 60 వేలు నగదు, గరుడ అవార్డు పొందింది. జడ్చర్ల నవజ్యోతి కళా మండలి వారు ప్రదర్శించిన ‘ మైరావణ’ పద్యనాటకం తృతీయ స్థానం సాధించి రూ.40 వేలు నగదు, గరుడ అవార్డు కై వసం చేసుకుంది.


