నాగలాపురం : మండలంలోని కొట్టకాడు గ్రామంలో మంగళవారం ఓ 14 ఏళ్ల బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించి దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడైన జి.నాగరాజును పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ సునీల్ మాట్లాడుతూ నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచి రిమాండుకు తరలించినట్లు వివరించారు.
‘ఆడికృత్తిక’కు రూ.26.50 లక్షలు
తిరుపతి రూరల్ : పాకాల మండలం ఊట్లవారిపల్లె ఆనందగిరిపై కొలువైన శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడికృత్తిక బ్రహ్మోత్సవా ల సందర్భంగా ఆలయానికి రూ.26,50,436 ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎస్.యువరాణి బుధవారం తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.4,41,900, హారతి ద్వారా రూ.81,850, అర్చన టికెట్ల ద్వారా రూ.75,800, కావడి టికెట్ల ద్వారా రూ.74,540, తలనీలాల ద్వారా రూ.46,325 ఆదాయం వచ్చిందన్నారు. తాత్కాలిక హుండీల ద్వారా రూ.7,30,003, శాశ్వత హుండీల ద్వారా రూ.9,24,018, తలనీలాల వేలం ద్వారా రూ.2,76,000 సమకూరినట్లు వివరించారు.


