శతాధిక వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

శతాధిక వృద్ధురాలి మృతి

Aug 13 2026 1:45 AM | Updated on Aug 13 2026 1:45 AM

చంద్రగిరి: చంద్రగిరి మాజీ ఎంఈఓ ఆవుల వెంకటరత్నం తల్లి, పనపాకం పేటకు చెందిన శతాధిక వృద్ధురాలు ఆవుల చెంగమ్మ మృతి చెందారు. వందేళ్లు దాటినప్పటికీ ఆరోగ్యంగానే ఉన్న ఆమె ఆకస్మికంగా కన్నుమూయడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. బుధవారం ఆమె అంత్యక్రియలను స్వగ్రామం పనపాకం పేటలో నిర్వహించారు. చెంగమ్మ మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌ రెడ్డి పనపాకం పేటకు వెళ్లి ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చెంగమ్మకు ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలోనే సేవలందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement