చంద్రగిరి:ఎనిమిదేళ్లుగా ప్రేమించిన ప్రియుడికి మరో వారం రోజు ల్లో వేరే అమ్మాయితో వివాహం జరుగుతుండడంతో, మనస్తాపం చెందిన ఓ యువతి బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చంద్రగిరి మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చంద్రగిరి మండలం అరిగెలవారిపల్లెకు చెందిన షాలిని(21), పనపాకం దళితవాడకు చెందిన ఎస్. చందు ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన షాలిని కుటుంబ సభ్యులు ఆమెను బెంగళూరు పంపించి, అక్కడ ప్రైవేటు కళాశాలలో చేర్పించారు. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న షాలినీని, చందు అక్కడికి వెళ్లి కలుస్తూనే ఉండేవాడు. గతంలో మైనర్‌గా ఉన్న షాలినికి కుటుంబ సభ్యులు వివా హం జరిపించేందుకు ప్రయత్నించగా, చందు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసి అడ్డుకున్నాడు. అయితే ఇటీవల చందు కుటుంబ సభ్యులు అతనికి మరో అమ్మాయితో వివాహం నిశ్చయం చేశారు. వారంలో ప్రియుడికి పెళ్లి కాబోతుందనే నిజాన్ని తట్టుకోలేకపోయిన షాలిని, సోమవారం బెంగళూరులోని తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. ఆత్మహత్యకు ముందు ఆమె చివరి ఫోన్‌కాల్ చందుకే చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి, పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం అరిగెలవారిపల్లెకు తరలించారు. ప్రియురాలి మరణవార్త తెలిసి చందు పరారయ్యాడు.


