శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ బుధవారం సందర్శించారు. మూడవ కాలాభిషేకంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని అనంతరం ఆలయంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. క్యూలో భక్తులతో మాట్లాడారు. రాహుకేతు మండపాల్లో పర్యటించి వెండి నాగపడగలను తనిఖీ చేశారు. జలవినాయకుని ఆలయం వద్ద సుందరీకరణ పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం సెంట్రల్ టికెట్ కౌంటర్లకు వెళ్లి ఆన్‌లైన్ టికెట్ల విధానంలో వస్తున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక మాన్యువల్ కౌంటర్‌ను ఏర్పాటుచేయలని ఈఓను ఆదేశించారు. భక్తులు వారే ఆన్‌లైన్‌లో టికెట్లు పొందేలా సిబ్బంది గైడ్ చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే మరుగుదొడ్లను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. అలాగే బుధవారం సాక్షిలో ప్రచురితమైన ‘అధనం కోసం ఆరాటం’ కథనంపై చర్చించినట్లు తెలిసింది. ఈఓ బీకే వెంకటేశులు, ఏఈఓలు మోహన్, హేమమాలిని, సూపరింటెండెంట్ లోకేష్ పాల్గొన్నారు.


