పారిశుద్ధ్య కార్మికుల ఆకలికేకలు
వరదయ్యపాళెం:పారిశుద్ధ్య కార్మికులు ఆకలికేకలతో అలమటిస్తున్నారు. మండలంలోని ఇందిరానగర్‌కు చెందిన గిరిజన పారిశుద్ధ్య కార్మికులు నాగరాజు, మునిభూషణ నాలుగు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊరిలో చెత్త ఊడ్చడం, డ్రైన్లు శుభ్రం చేయడం లాంటి పనులు చేస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. అయితే నాలుగు నెలలుగా వేతనా లు రాకపోవడంతో కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ప్రతిసారీ ‘రేపు రండి, ఫైల్ పెండింగ్ లో ఉంది, ఫండ్స్ రాలేదు‘ అనే సమాధానం చెబుతు న్నారని వాపోతున్నారు. ఇంట్లో బియ్యం అయిపోయాయి.. పిల్లల అవసరాలు తీర్చ లేకున్నాం.. ఓ వైపు అప్పులు పెరిగిపోతున్నాయంటూ ఆవేదన చెందతు న్నారు. ఇలావల సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన డివిజనల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి, డీఎల్‌డీఓ జాలిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే బిల్లులు చెల్లించండి అంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. కానీ స్థానిక ఎంపీడీఓ విజయమ్మ, పంచాయతీ కార్యదర్శి మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.


