ఎస్వీయూలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఎస్వీయూలో అగ్నిప్రమాదం

Jul 22 2026 12:30 AM | Updated on Jul 22 2026 12:30 AM

● ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపల్‌ గదిలో చెలరేగిన మంటలు.. కాలిబూడిదైన సామగ్రి

తిరుపతి సిటీ: శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ(ఎస్వీయూ)లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో మంగళవారం ఉదయం షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు భయబ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రిన్సి పాల్‌ గదిలోని వస్తువులు బూడిదయ్యాయి. వీటి విలువ రూ.3 లక్షలకు పైగా ఉంటుందని సిబ్బంది చెప్పారు. వైస్‌ చాన్సలర్‌ నర్సింగరావు, రెక్టార్‌ అప్పారావు, రిజిస్ట్రార్‌ భూపతినాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నష్టం అంచనాతో పాటు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. వర్సిటీలో విద్యుత్‌ వ్యవస్థ నిర్వహణ, భద్రతా ప్రమాణా లు ప్రశ్నార్థకంగా మారాయని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైఎస్సార్‌సీపీ ఎస్వీయూ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ప్రేమ్‌, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు రాపూరి ప్రసాద్‌, సీఐటీయూ నేత మాధవ్‌ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement