తిరుపతి సిటీ: ఎస్వీయూలో కాంట్రాక్ట్ అధ్యాపకులు రోడ్డెక్కారు. బాబు సర్కార్ వ్యవహారశైలితో తమకు ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన చెందుతూ పిడికిలి బిగించారు. మంగళవారం ఎస్వీయూ ప్రధాన ద్వారం వద్ద వర్సిటీలో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులు సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా వర్సిటీకి సేవలందిస్తున్న తమకు ప్రభుత్వ భరోసా కల్పించాలని కోరారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసి అధ్యాపక పోస్టుల నియామక ప్రక్రియలో తమను అనర్హులుగా పరిగణించడం దారుణమన్నారు. మానవతా దృక్పథంతో గత కొన్నేళ్లుగా వర్సిటీని నమ్ముకుని సేవ చేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, వర్సి టీ అధికారులు పట్టించుకోకపోవడంతో నడిరోడ్డుపైకి రావాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. తక్షణం ప్రభుత్వం నిబంధనలను సడలించాలని వేడుకున్నారు. లేఎస్వీయూలో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


