నిర్మాణ పనులు వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

నిర్మాణ పనులు వేగవంతం చేయండి

Jul 22 2026 12:30 AM | Updated on Jul 22 2026 12:30 AM

తిరుపతి అర్బన్‌: జాతీయ రహదారుల నిర్మాణ పనులు, రైల్వే ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావుతో కలసి ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గడువులోపు పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భూసేకరణకు సంబంధించి ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటికి పరిష్కారం మార్గాలు చూపుతామని వివరించారు. అలాగే శ్రీసిటీ, కొల్లడం, ఇరుగుళం, రాళ్లకుప్పం, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. తిరుపతి, నెల్లూరు నేషనల్‌ హైవే పీడీలు వెంకటేశ్వర్లు, రమేష్‌, సదరన్‌ రైల్వే అధికారి వామనమూర్తి, నెల్లూరు ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ శివకుమార్‌, ఆర్టీవోలు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement