కన్నీటి సుడులు..కష్టాల వినతులు | - | Sakshi
Sakshi News home page

కన్నీటి సుడులు..కష్టాల వినతులు

Jul 21 2026 2:00 AM | Updated on Jul 21 2026 2:00 AM

బాధలు భరించలేక.. కన్నీటి సుడులతో కష్టాలు చెప్పుకుందామని పలువురు అభాగ్యులు సోమవారం తిరుపతి కలెక్టరేట్‌ మెట్లెక్కారు. చంటిబిడ్డలనెత్తుకుని కొందరు, ఊతకర్రల సాయంతో వృద్ధులు, వీల్‌చైర్‌కే పరిమితమైన దివ్యాంగులు, మానసిక సమస్యలతో బాధపడుతున్న పిల్లు ఎటుచూసినా కనిపించారు. అర్జీలు చేతబట్టి ‘అయ్యా.. మా కష్టాలు తీర్చండి మహాప్రభో’ అంటూ అధికారుల కాళ్లావేళ్లాపడ్డారు. నెలల తరబడి తిరుగుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని, భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. – ఫోటోలు–సాక్షి ఫొటోగ్రాఫర్‌, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement