తిరుపతి కల్చరల్ : తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఆదివారం ప్రదర్శించిన పౌరాణిక, సాంఘిక నాటక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అభినయ ఆర్ట్స్ 26వ వార్షికోత్సవంలో భాగంగా చేపట్టిన జాతీయ నాటక, నృత్య పోటీలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు అద్భుతంగా నృత్యాలు ప్రదర్శించారు. ఆనందనిలయం, ‘అనగనగా ఓ రాత్రి, ‘నెట్ నాటికలు సందేశాత్మకంగా సాగాయి. అనంతరం కళా బృందాలను అభినయ ఆర్ట్స్ వ్యవస్థాపక కార్యదర్శి బీఎన్,రెడ్డి ఘనంగా సత్కరించారు.
నేడు కలెక్టరేట్‌లో ‘గ్రీవెన్స్’
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ (గ్రీవెన్స్) నిర్వహించనున్నట్లు అధికారులు ఆది వారం వెల్లడించారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు వినతులు స్వీకరించనున్నట్లు తెలిపారు. మండల, డివిజన్ కార్యాలయా ల్లో సైతం అర్జీలు సమర్పించవచ్చని వివరించారు.


