రేణిగుంట: మండలంలోని గాజులమండ్యం పంచాయతీలో గత 30 ఏళ్లకు పైగా నేపాల్ దేశస్తులు నివాసముంటున్నారు. రామ్‌బహుదూర్, గోపాల్ బహుదూర్ అనేవారు నేపాల్ నుంచి గాజులమండ్యం పారిశ్రామిక వాడలోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ దేశమ్మ నగర్‌లో ఉంటున్నారు. 2002 ఓటర్ల జాబితాలో వారిలో కొందరికి ఓట్లు ఉన్నాయి. ఈ క్రమంలో 15 మంది నేపాల్ దేశస్తుల ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌ఓ తిరస్కరించారు. ఈ విషయాన్ని వైఎస్‌ఆర్‌సీపీ బీఎల్‌ఏలు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డికు తెలియజేశారు. ఈ క్రమంలో ఆర్డీఓ మంగళవారం గాజుల మండ్యం సచివాలయానికి చేరుకున్నారుకుని నేపాల్ దేశస్తులతో మాట్లాడారు. వారి వద్ద ఉన్న అడ్రస్ ప్రూఫ్‌లను సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఈనెల 24వ తేదీ వరకు మ్యాపింగ్ ప్రక్రియ గడువును పొడిగించిందని, ఇంకా ఎవరైనా మ్యాపింగ్ చేసుకోనివారు మ్యాపింగ్ చేయించుకోవాలని సూచించారు. ఇక్కడ నివాసం ఉంటున్న 15 మంది నేపాల్ దేశస్తుల వివరాలు తీసుకున్నామని, కలెక్టరేట్‌లో జరిగే ఆల్ పార్టీ మీటింగ్‌లో ఈ విషయాన్ని చర్చించి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.


