తిరుపతి అన్నమయ్యసర్కిల్: దళితుల ఐక్యతను దెబ్బతీసేందుకు దేశవ్యాప్త రాజకీయ కుట్రలో భాగంగా తీసుకొచ్చిన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ రద్దు చేయాల ని రాక్స్ అండ్ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చట్టం చేసేంతవరకు నిరంతర శాంతియుత పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అణగదొక్కుతుంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం భాదకరమన్నారు. కార్యక్రమంలో కొప్పెరా చిన చెన్నయ్య, దాసరి చిన్న లింగామయ్య, మహేష్, గణేష్, నానీ, చిన్నా పాల్గొన్నారు.


