వరసకు చెల్లైలెన బాలికపై లైంగిక దాడి | - | Sakshi
Sakshi News home page

వరసకు చెల్లైలెన బాలికపై లైంగిక దాడి

Jul 15 2026 12:29 AM | Updated on Jul 15 2026 12:29 AM

● నాయుడుపేట మండలంలో ఘటన

● నాయుడుపేట మండలంలో ఘటన

నాయుడుపేట టౌన్‌: వరసకు చెల్లైలెన బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మంగళవారం సాయంత్రం నాయుడుపేట మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాయుడుపేట పట్టణంలోని ఒక ప్రైవేట్‌ పాఠశాలలో ఇంటర్‌ చదువుతున్న మైనర్‌ బాలిక కళాశాల ముగిసిన తర్వాత ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో విన్నమాల గ్రామానికి చెందిన, వరుసకు సోదరుడైన గుండాల రాకేష్‌ అనే యువకుడు అక్కడికి వచ్చి ఇంటివద్ద దించుతానని మాయమాటలు చెప్పి బాలికను బైక్‌ ఎక్కించుకున్నాడు. అయితే, ఇంటికి తీసుకువెళ్లకుండా బిరదవాడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. మార్గం మధ్యలో అనుమానం వచ్చిన బాలిక బైక్‌నుంచి దూకేందుకు ప్రయత్నించగా.. చంపేస్తానని బెదిరించాడు. అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఎంత బతిమాలినా, కాళ్లు పట్టుకున్నా వినకుండా క్రూరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించి, గాయాలతో ఉన్న బాలికను ఆమె నివాసం వద్ద వదిలిపెట్టి పరారయ్యాడు. బాధితురాలు జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో నాయుడుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు రాకేష్‌ సూళ్లూరుపేటలోని ఒక జ్యువెలరీ షాపులో పనిచేస్తున్నట్టు తెలిసింది. బాధితుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement