ఉత్తమ ఫలితాలకు ప్రత్యేక ప్రణాళిక
గత ఏడాది కంటే 2025–26 సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తాం. పదో తరగతిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ముందుకెళ్లుతున్నాం. ఉపాధ్యాయుల కొరతను నివారించి అన్ని సబ్జెక్ట్‌ల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. పది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వంద రోజుల ప్రణాళికతో ప్రతి విద్యార్థికి ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాం.
– కేవీఎన్ కుమార్, డీఈఓ, తిరుపతి జిల్లా
కొత్తపరీక్షా విధానంతో తొలిసారి..
ఇంటర్ ఫలితాల్లో గత ఏడాది జిల్లా టాప్ 10లో ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నూతన సిలబస్‌తో కొత్త పరీక్షా విధానాన్ని ఎదుర్కొబోతున్నారు. అందుకు తగ్గట్టు అధ్యాపకులకు శిక్షణ ఇచ్చి నాణ్యమైన బోధన అందించాం. విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఫ్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నాం. పబ్లిక్ పరీక్షల నిర్వహణ, సంకల్ప్–2026 వంటి పలు అంశాలపై రెండు రోజుల క్రితం ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి దిశానిర్ధేశం చేసింది. ఆ మేరకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం.
– జి రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐఓ, తిరుపతి జిల్లా
ఉత్తమ ఫలితాలకు ప్రత్యేక ప్రణాళిక


