మీ బిడ్డను బడికి పంపే వరకు ఇక్కడే ఉంటా!
బుచ్చినాయుడుకండ్రిగ: ‘మీ బిడ్డను బడికి పంపే వరకు మీ ఇంటి వద్దనే ఉంటానని’ ఎంఈఓ–2 మునిసుబ్రమణ్యం విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పారు. మండలంలోని గాజులపెళ్లూరులోని ఎస్సీ, ఎస్టీ కాలనీలో బడి బయట కార్యక్రమంలో భాగంగా ఓ విద్యార్థిని ఇంటికి వెళ్లిన ఎంఈఓ చిన్నారిని బడికి పంపాలని తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ బిడ్డను తాము తీసుకొని వస్తాం మీరు వెళ్లండి సార్ అని తల్లిదండ్రులు తెలిపారు. అయితే ఆ ఎంఈఓ అక్కడి నుంచి కదలలేదు. బిడ్డను బడికి పంపే వరకు మీ ఇంటి వద్దనే కుర్చి వేసుకుని కూర్చుంటానన్నారు. అరగంట సేపు ఇంటి వద్ద నుంచి ఎంఈఓ కదలకపోవడంతో చివరకు తల్లిదండ్రులకు చిన్నారిని బడికి పంపారు.
ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: శ్రీనివాసమంగాపురానికి చెందిన వెంకట నాగరాజ శర్మ మంగళవారం టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణ దాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు డీడీని మంగళవారం దాత తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈఓ అనిల్ కు మార్ సింఘాల్‌కు అందజేశారు. కాగా దాత వెంకట నాగరాజశర్మ శ్రీనివాసమంగాపురంలోని కల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయంలో వేదపారాయణదారుగా పనిచేస్తున్నారు.
మీ బిడ్డను బడికి పంపే వరకు ఇక్కడే ఉంటా!


