చీకటి ఒప్పందం..
రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు మిలాఖత్
గత ప్రభుత్వంలో జోరుగా పనులు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని రైతులు, ప్రజలకు నీటి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం పుంజుకుందన్నారు. ఎత్తిపోతల పథకం పూర్తి అయితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందనే ముందుగా చూపుతో గొప్ప పథకాన్ని ఆయన పకడ్బందిగా చేపట్టారన్నారు. సాక్షాత్తు పోలీసుల వెంటబెట్టుకుని వైఎస్ జగన్ సర్కారు తమకు రావాల్సిన నీటిని రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ప్రజల నీటి కష్టాలను ఈ ప్రభుత్వం విస్మరించి, పక్కరాష్ట్ర సీఎంకు జీ హుజూర్ అంటూ సలాం కొడుతున్నారన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్నా.. చంద్రబాబు సర్కారు స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అభినయ్ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో సుమారు రూ.7 వేల కోట్లను అప్పటి సీఎం వైఎస్ జగన్ ఎత్తిపోతల పథకానికి కేటాయించారని ఆయన తెలిపారు. శ్రీశైలం, తెలుగుగంగ, నగరి–గాలేరు ప్రాజెక్టులకు నీళ్లు అందించాలని సంకల్పించారన్నారు. రాయలసీమకు జీవనాడిగా భావించిన పథకాన్ని చంద్రబాబు అడ్డుకోవడం దేనికి సంకేతమని మండిపడ్డారు.
చంద్రగిరి: చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం తన శిష్యుడితో కలసి రాయలసీమతోపాటు గుంటూరు, నెల్లూరు జిల్లాల ప్రజలకు తీవ్ర ద్రోహం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి భూమన అభినయ్ మండిపడ్డారు. రాయలసీమకు తలమానికమైన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాను అడ్డుకున్నానని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేయడంతో చంద్రబాబు సీమకు చేస్తున్న ద్రోహం బట్టబయలైందన్నారు. సోమవారం వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ రెడ్డి, రాయలసీమ ఉద్యమకారుడు, మాజీ శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రమణ్యం రెడ్డి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తిరుచానూరులోని జిల్లా కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ సీపీ, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. వందలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజా సంఘాల నేతలు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం తెలిపారు.
సైంధవుడిలా సీమ ప్రజలకు బాబు ద్రోహం
అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు సైంధవుడిలా వ్యవహరిస్తూ సీమ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని భూమన అభినయ్ మండిపడ్డా రు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితులైన గురు, శిష్యులిద్దరూ చేరి రాష్ట్రాన్ని నాశనం చేయాలనే సంకల్పించారని ఆరోపించారు. ఎత్తిపోతల పథకంలో భాగంగా 90 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ వాడుకోవాల్సి ఉందని, అయితే చంద్ర బాబు పాలనలో కనీసం 12 వేల క్యూసెక్కుల నీటిని కూడా వాడుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరూ సీఎంలు చీకటి ఒప్పందాలతో రైతులకు తీవ్ర అన్యా యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 800 అడుగుల నీళ్లు ఉండగానే తెలంగాణలోని వారు దిండి, పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాంతాలకు ఎత్తిపోతల నీటిని తరలించడం, కూటమి ప్రభుత్వం వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అవలంభిస్తున్న తీరుతో ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని మదనపల్లి, తంబళ్లపల్లి, చిత్తూరు ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం రైతులు ఉత్తరాంధ్ర బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు రాజధాని పేరుతో చంద్రబాబు పేదల భూములను లాక్కొంటూ, మరోవైపు ప్రాజెక్టులను తెలంగాణకు దోచిపెట్టి రాయలసమీతో పాటు రాష్ట్రాన్ని ఎడారిగా మార్చుతున్నారని మండిపడ్డారు.
భూమన అభినయ్ అక్రమ అరెస్టు
రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై రైతులు, ప్రజాసంఘాలతో భూమన అభినయ్ చేస్తున్న శాంతియుత నిరసన కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పోలీసుల అండతో అడ్డుకుంది. భూమన అభియన్‌తో పాటు సుమారు 29 మంది వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి, తిరుచానూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. సుమారు 4 గంటల పాటు పోలీసు స్టేషన్‌లో నిర్భధించారు. దీంతో నేతలు స్టేషన్‌లో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూమన అభినయ్‌తో పాటు 29 మందిపై కేసులు నమోదు చేశారు. ఆపై సొంత పూచీకత్తుతో సాయంత్రం 3.30 గంటలకు విడుదల చేశారు.
‘సీఎం చంద్రబాబు స్వార్థం.. శిష్యుడితో చీకటి ఒప్పందం.. తెలంగాణా అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు..అయినా స్పందించని బాబు సర్కారు.. ఫలితం సీమ ఎత్తిపోతల పథకానికి అడ్డంకి.. రాయలసీమతోపాటు కోస్తాలో రెండు జిల్లాలకు తప్పని నీటి కష్టాలు..రాష్ట్రానికి తీరని అన్యాయం’ జరిగిందని వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ మండిపడ్డారు.
రాయలసీమకు అన్యాయం చేస్తే ప్రజాగ్రహం తప్పదు
రాయలసీమకు నీళ్లు రాకుండా సీఎం చంద్రబాబు, ఆయన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని అభినయ్ స్పష్టం చేశారు. నాలుగు సార్లు సీఎం అని చెప్పుకునే వ్యక్తి, తన శిష్యుడిని ఎదు రించలేక ప్రాజెక్టులను తెలంగాణకు నీటి పథకం కట్టబెట్టడమేనా? 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అని నిలదీశారు. రాయలసీమను నీటితో సస్యశ్యామ లం చేయడం చేతకాని ఈ సీఎం, రాక్షసుడిలా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని, తమకు రావాల్సిన నీటిని తీసుకురాకుండా, సీమ ప్రజలను మోసం చేస్తే ప్రజా సంఘాలతో కలసి వైఎస్సార్‌సీపీ పోరును మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.
చీకటి ఒప్పందం..
చీకటి ఒప్పందం..


