ప్రభుత్వ భూమిని కాపాడండి
తిరుపతి రూరల్: ‘తమ గ్రామంలో రూ.30 కోట్లు విలువైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయడానికి అధికార పార్టీకి చెందిన కొందరు ఆక్రమణదారులు పక్కాగా స్కెచ్ వేస్తున్నారని, వారి నుంచి ఆ విలువైన భూమిని కాపాడాలని చిగురువాడ గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా చిగురువాడకు చెందిన తొమ్మిదో వార్డు సభ్యులు ముచ్చేలి కిరణ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు చేరుకుని డీఆర్వో నరసింహులుకు వినతిపత్రం అందజేశారు. ఆ తరువాత తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. అలాగే తిరుపతి రూరల్ తహసీల్దార్ వద్దకు వెళ్లిన ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమణదారులకు కట్టబెట్టాలని చూస్తే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఉన్నత స్థాయి అధికారులు ప్రభుత్వ భూములను తప్పకుండా కాపాడుతామని, ఆక్రమణదారులు అందులోకి వెళ్లకుండా చూస్తామని హామీ ఇచ్చారు.


