● సరస్సులో కొత్త విహంగాల విడిది ● చెరువు గట్ల సమీపంలో విహారం | - | Sakshi
Sakshi News home page

● సరస్సులో కొత్త విహంగాల విడిది ● చెరువు గట్ల సమీపంలో విహారం

Jan 6 2026 8:00 AM | Updated on Jan 6 2026 8:00 AM

● సరస

● సరస్సులో కొత్త విహంగాల విడిది ● చెరువు గట్ల సమీపంలో వ

● సరస్సులో కొత్త విహంగాల విడిది ● చెరువు గట్ల సమీపంలో విహారం

సూళ్లూరుపేట: వరుణుడు కరుణించడంతో పులికాట్‌ సరస్సుతోపాటు ఆ సరస్సు సమీప ప్రాంతాల్లోని చెరువులకు పుష్కలంగా నీరు చేరడంతో ఏటా వచ్చే విదేశీ విహంగాలే కాకుండా కొత్తరకం వలస విహంగాలు కూడా దర్శనమిస్తున్నాయి. మామూలుగా అయితే ప్లెమింగోలు, పెలికాన్స్‌, పెయింటెడ్‌ స్టార్క్స్‌, అనే రకాల బాతులు శీతాకాలంలో ఈ ప్రాంతంలో విడిది చేసి, సుమారు ఐదు నెలలు పాటు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి చేసుకుని వెళ్లిపోతుంటాయి. అయితే పులికాట్‌ సమీపంలోని పొలాలు, చెరువుల లోతట్టు ప్రాంతాల్లో మరికొన్ని జాతులు పక్షులు కూడా దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పక్షులు సంవృద్ధిగా నీరు చేరినపుడు మాత్రమే దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా పులికాట్‌ సమీపంలోని కుదిరి చెరువు, అటకానితిప్ప వద్ద మంచినీటి గుంత, సరస్సుకు సమీపంలోని అటవీప్రాంతంలో ఇలాంటి పక్షులు కనిపిస్తున్నాయి. వాటిల్లో నీలిబొల్లికోడి, బ్లాక్‌ విల్లింగ్‌స్టన్‌, వైట్‌ విల్లింగ్‌స్టన్‌, పాము మెడ పక్షి, శాలవ, తోకబాతు, తెల్ల పరజలు, బూడిద కలర్‌ ఫ్లెమింగో, శ్వేతవర్ణ రంగు ఫ్లెమింగోలు అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటక ప్రియులు మామూలుగా ఉండే పక్షులను కాకుండా కొత్తరంగా పక్షులును ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

నీలిబొల్లికోడి

ఈ కొత్తరకం పక్షి పులికాట్‌ సరస్సులో వేటాడదు. కేవలం కుదిరి, కారిజాత, చెరువుల సమీపంలోనే వుండి చేపలను వేటాడుతుంది. ఇది నీలిరంగు కలిగి కోడిలాగా ఉండడంతో దీనికి ఆ పేరు వచ్చినట్టుగా తెలుస్తోంది.

శాలవ

ఈ పక్షులు ఇక్కడే ఉంటాయి. ఎక్కువగా కోడి పిల్లలను వేటాడుతుంటాయి. ఈ శీతాకాలంలో మాత్రం పులికాట్‌ సరస్సు అంచున చిత్తడి చిత్తడిగా ఉండే ప్రాంతంలో తక్కువగా నీరు ఉండే ప్రాంతంలో ఉంటూ చేపల్ని వేటాడి ఆహారంగా తీసుకుంటాయి.

వైట్‌ విల్లింగ్‌స్టన్‌

ఈ పక్షులు బహు అరుదుగా కనిపిస్తాయి. ఈ పక్షులు సరస్సు ఒడ్డున, చిత్తడిగా ఉన్న నేలల్లో, చెరువుల చెంతన ఉండి చేపలను వేటాడుతుంటాయి. ఈ పక్షులు ఈసారి అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి.

తెల్లపరజలు

ఈ పక్షులు వలస వచ్చే పక్షులే. ఇవి బాతుల ఆకారంలో ఉండి పులికాట్‌ సరస్సులో ఈత ఆడుతూ చేపల్ని వేటాడుతూ ఆహారాన్ని తీసుకుంటాయి. ఈ పక్షులు కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి.

తోకబాతు

ఈ పక్షులు కూడా చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇవి కూడా చిత్తడిగా వున్న ప్రాంతంలో, తక్కువగా నీళ్లున్న చోట గడ్డిమాటునటుండి చేపల్ని వేటాడతాయి.

శ్వేతవర్ణ ఫ్లెమింగో

శ్వేత వర్ణం కలిగిన ప్లెమింగో ఇది. ఈ పక్షులు హంసను పోలివుంటాయి. పులికాట్‌ సరస్సు అడుగు భాగంలో నాచును బయటకు తీసి ఆహారంగా తీసుకుంటాయి. ఇవి గుంపులు గుంపులుగా కనిపిస్తుంటాయి. కాని ఒక్కటే ఆహారవేటలో ఉండగా తీసిన చిత్రమిది.

పాముమెడపక్షి

పాముమెడ పక్షులు చాలా తక్కువగా ఉంటాయి. ఇది విదేశీ వలస పక్షే. ఈ పక్షులు కూడా చిత్తడి నేల, చెరువుల సమీపంలో ఉండి చేపల్ని వేటాడుతుంటాయి. గడ్డిమాటున ఉన్నప్పుడు ఈ పక్షులను రైతులు చూసినప్పుడు పాము అనుకునే వారు. తీరా దగ్గరకు వెళితే గానీ పక్షి కనిపించదు. దీని మెడ పాము పడగలాగా ఉండడంతో దీన్ని పాముమెడ పక్షిగా పిలుస్తుంటారు.

బూడిదరంగు ఫ్లెమింగో

ఈ బూడిద రంగు ఫ్లెమింగోలు బహు అరుదుగా కనిపిస్తుంటాయి. మామూలుగా వచ్చే ఫ్లెమింగోలు తెలుపు, రోజ్‌ కలర్‌ కలిగి ఉంటాయి. ఇది మాత్రం బూడిద రంగులో ఉండి సరస్సులో నాచును మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది.

బ్లాక్‌ విల్లింగ్‌స్టన్‌

ఈ పక్షులు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇవి కూడా చిత్తడిగా ఉన్న నేలలో ఉంటాయి. ఒంటికాలుతో ఎంతసేపైనా నిలబడగలవు. ఇది కూడా తుంగ గడ్డి మాటున ఉండి చేపల్ని వేటాడి ఆహారంగా తీసుకుంటాయి.

ఎర్రకాళ్ల కొంగలు

ఇవి పూర్తి విదేశీ వలస పక్షులైనప్పటికీ ఎప్పుడు ఇక్కడే నివాసం ఉంటున్నాయి. ఈ శీతాకాలంలో ఈ పక్షులు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. ఇవి ఆహారవేటలో చేసే విన్యాసాలు బహు ముచ్చటగా ఉంటాయి. ఇవి జపం చేస్తాయి. వాటి పొడవాటి ముక్కులతో పోట్లాడతాయి.

● సరస్సులో కొత్త విహంగాల విడిది ● చెరువు గట్ల సమీపంలో వ1
1/6

● సరస్సులో కొత్త విహంగాల విడిది ● చెరువు గట్ల సమీపంలో వ

● సరస్సులో కొత్త విహంగాల విడిది ● చెరువు గట్ల సమీపంలో వ2
2/6

● సరస్సులో కొత్త విహంగాల విడిది ● చెరువు గట్ల సమీపంలో వ

● సరస్సులో కొత్త విహంగాల విడిది ● చెరువు గట్ల సమీపంలో వ3
3/6

● సరస్సులో కొత్త విహంగాల విడిది ● చెరువు గట్ల సమీపంలో వ

● సరస్సులో కొత్త విహంగాల విడిది ● చెరువు గట్ల సమీపంలో వ4
4/6

● సరస్సులో కొత్త విహంగాల విడిది ● చెరువు గట్ల సమీపంలో వ

● సరస్సులో కొత్త విహంగాల విడిది ● చెరువు గట్ల సమీపంలో వ5
5/6

● సరస్సులో కొత్త విహంగాల విడిది ● చెరువు గట్ల సమీపంలో వ

● సరస్సులో కొత్త విహంగాల విడిది ● చెరువు గట్ల సమీపంలో వ6
6/6

● సరస్సులో కొత్త విహంగాల విడిది ● చెరువు గట్ల సమీపంలో వ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement