
డీఎస్సీ ఆశలు ఢమాల్!
జిల్లా సమాచారం
బయాలజీ, సోషియల్‌లో డీఎస్సీ రాసిన అభ్యర్థులు
జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్టుల సంఖ్య 63
స్కూల్ అసిస్టెంట్ సోషియల్ సబ్జెక్ట్ పోస్టుల సంఖ్య 130
బయాలజీ సబ్జెక్ట్‌తో పరీక్షలకు హాజరైన అభ్యర్థులు 3,450
సోషియల్ సబ్జెక్ట్‌తో పరీక్షలకు హాజరైన అభ్యర్థులు 6,955
డీఎస్పీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ నిరాశనే మిగులుస్తోంది. రాత్రింబవళ్లు చదివినా రిక్త హస్తమే ఎదురవుతోంది. కష్టపడి పరీక్ష రాసినా ఫలితం శూన్యంగానే మారుతోంది. ప్రభుత్వం తీసుకువచ్చిన నార్మలైజేషన్ విధానం అభ్యర్థుల ఆశలను తారుమారు చేస్తోంది. ప్రధానంగా బయాలజీ.. సోషియల్ సబ్జెక్టులను ఎంచుకున్నవారికే అధికంగా నష్టం జరుగుతోంది. అందులోనూ ఆన్‌లైన్ ఎగ్జామ్ తొలి సెషన్‌కు హాజరైన వారే బాధితులుగా మారే దుస్థితి దాపురించింది.
అందరికీ సమన్యాయం చేయాలి
రెండవ షిఫ్ట్‌లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీషు, ఉర్దూ, తమిళ, ఒడిశా, కన్నడ మీడియం అభ్యర్థులు కలిసి పరీక్షలకు హాజరయ్యారని, వారందరినీ కలిపి నార్మలైజేషన్ చేయడం వలన ఉదయం షిఫ్ట్‌లో పరీక్షలు రాసిన వారికి తీవ్ర అన్యాయం జరుగిందన్నారు. జిల్లాలో పదుల సంఖ్యలో మాత్రమే బయాలజీ పోస్టులు ఉన్నందున్న ప్రతిభ గల అభ్యర్థులు ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషియల్ విభాగంలో పరీక్షలు రాసిన అభ్యర్థులు సైతం ఇదే సమస్య ఎదుర్కొంటున్నట్లు సమాచారం. వెంటనే ప్రభుత్వం నార్మలైజేషన్ విషయంలో రెండు షిఫ్ట్‌లలో పరీక్షలు రాసిన అభ్యర్థులకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలితాలను సవరిస్తే ప్రతిభ గల అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికవుతారని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.