
కలెక్టర్ గారూ.. పద్మగిరిని కాపాడండి!
తిరుపతి రూరల్: మండలంలోని తనపల్లెకు ఆనుకుని ఉన్న పద్మగిరి కొండను కాపాడండి సార్.. కలెక్టర్ గారూ.. అంటూ ఆలయ కమిటీ సభ్యులు విజయసింహారెడ్డి కుమారుడు హేమంత్‌కుమార్‌రెడ్డి వినతిపత్రం అందించారు. సోమవారం కలెక్టర్‌ను కలసిన ఆయన ఈ నెల 16వ తేదీన శ్ఙ్రీగుట్టుగా గుట్టమీద పాగా!శ్రీశ్రీఅన్న శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. పద్మగిరిని చెరబట్టారని పలు వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఆక్రమణల వల్ల కోట్లు ఖర్చు పెట్టి కొండపైకి నిర్మించిన రహదారి కుంగిపోయే ప్రమాదముందని వివరించారు. ఆ మేరకు స్పందించిన కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి రూరల్ తహసీల్దారుకు రెండు సార్లు ఫోన్ చేయగా ఆయన ఫోన్ పనిచేయలేదు.. దీంతో వీళ్లు పనిచేయరు.. వీళ్ల ఫోను పనిచేయదు.. అంటూ అసహనం వ్యక్తం చేస్తూ సదరు అర్జీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సంతకం చేశారు. ఆ కాపీని తహసీల్దారును కలసి అందజేయాలని అర్జీదారు హేమంత్‌కుమార్‌రెడ్డికి కలెక్టర్ సూచించడంతో ఆయన తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కార్యాలయంలో తహసీల్దారు రామాంజులు నాయక్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది.