
వాహనాలు ఢీ : ఏడుగురికి గాయాలు
నాయుడుపేటటౌన్ : మండల పరిధిలోని అయ్యప్పరెడ్డి పాళెం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం నాలుగు వాహనాలు ఒకదానికి ఒకటి అదుపు తప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు బాగా దెబ్బతిన్నాయి. రెండు కార్లలో ఉన్న ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. ఒడిస్సా నుంచి బెంగళూరు వెళుతున్న లారీ మార్గ మధ్యలో అయ్యప్పరెడ్డి పాళెం జాతీయ రహదారి కూడలి సమీపంలో అదుపు తప్పి ముందు వెళుతున్న కారును ఢీకొంది. ఆ కారు ముందు వెళుతున్న మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు కార్లు బాగా దెబ్బతిన్నాయి. ఓజిలి ప్రాంతానికి చెందిన ఫ్రాంక్లీన్, మల్లికార్జున రెడ్డి, షేక్ రఫీ, బన్నీ , మరో కారులో ఉన్న మద్ది వీరయ్య, సునీత, సాయిలకు గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
డక్కిలి : విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమయింది. ఈ ఘటన మండలంలోని ఆల్తూరుపాడులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. అగ్నిమాపకశాఖ అధికారి ఆదినారాయణ కథనం మేరకు ఆల్తూరుపాడు గ్రామానికి చెందిన కటకం రమణయ్య పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఇంట్లో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వారు చేరుకొని మంటలను అదుపు చేశారు. బాధితుడికి రూ.లక్ష ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రొఫెసర్ దేవపస్రాదరాజుకు పత్రిష్టాత్మక పురస్కారం
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఫిజిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ బి దేవప్రసాద రాజు ప్రతిష్టాత్మక పురస్కారం పొందారు. రేర్ ఎర్త్ రంగంలో చేసిన పరిశోధనా కృషికి గుర్తింపుగా రేర్ ఎర్త్ అసోసియేషన్ ఈ పురస్కారాన్ని అందజేసింది. గురువారం భువనేశ్వర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్ చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. 16 ఏళ్లుగా ఎస్వీయూలో ఎన్నో పేరొందిన పరిశోధనలు చేపట్టిన ఆయన 5 జాతీయ, 3 అంతర్జాతీయ సదస్సులు, పరిశోధనా ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయి జర్నల్స్‌లో ఆయన రూపొందించిన 125 పరిశోధనా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 13 పీహెచ్‌డీ డిగ్రీలు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రేర్ ఎర్త్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ఎంఎల్‌పీ రెడ్డి, ఎస్వీయూ రిటైర్డు ప్రొఫెసర్ సీకే జయశంకర్, సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మావతి పురస్కారం పొందిన ఆయనను అభినందించారు.

వాహనాలు ఢీ : ఏడుగురికి గాయాలు

వాహనాలు ఢీ : ఏడుగురికి గాయాలు