
ఆధ్యాత్మికత దిశగా పల్లెసీమలు
పుంగనూరు: ప్రతి గ్రామంలోనూ రామాలయాలు, గంగమ్మ ఆలయాలు నిర్మించి, ఆధ్యాత్మికత వైపు పల్లెలు పయనిస్తుండడం అభినందనీయమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం మండలంలోని బాగేపల్లె గ్రామంలో గ్రామస్తులు నిర్మిస్తున్న నూతన గంగమ్మ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్దిరెడ్డికి మంగళ హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో సరదాగా గడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భక్తిమార్గంలో పయనిస్తున్నారని కొనియాడారు. గంగమ్మ తల్లి ప్రజలందరినీ చల్లగా చూడాలని, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు పండి ప్రజలంతా అభివృద్ధి చెందాలని కోరారు. ఎంపీపీ అక్కిసాని భాస్క ర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు రామమోహన్‌రెడ్డి, రాజారెడ్డి, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.