పచ్చమూక ఆక్రమణల పర్వంలో మచ్చుకు కొన్ని.. | - | Sakshi
Sakshi News home page

పచ్చమూక ఆక్రమణల పర్వంలో మచ్చుకు కొన్ని..

Aug 18 2025 5:33 AM | Updated on Aug 18 2025 5:33 AM

పచ్చమ

పచ్చమూక ఆక్రమణల పర్వంలో మచ్చుకు కొన్ని..

శివగిరిపల్లెలో గ్రామ కంఠం ఆక్రమణ ప్లాట్లు వేసి అమ్మకానికి పెట్టిన టీడీపీ నేత అనుమతులు లేకనే రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ భూ బకాసురులుగా మారిన పచ్చమూక జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా కబ్జాలు పూర్తిగా సహకరిస్తున్న అధికారులు

గూడూరు నియోజక వర్గం చిల్లకూరు మండల పరిధిలో జాతీయ రహదారికి పక్కనే రైటార్‌ సత్రం వద్ద రూ.కోట్ల విలువైన 1.50 ఎకరాల భూమి అక్రమణకు గురైంది.

గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని నెలటూరు సమీపంలో విలువైన భూమిని టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారు.

వెంకటగిరి పట్టణం ఎన్జీఓ కాలనీ పరిధిలోని విలువైన ప్రభుత్వ స్థలం పచ్చమూక కబ్జాలోకి వెళ్లిపోయింది.

వెంకటగిరి పట్టణం 14వ వార్డు పరిధిలోని బొగ్గులు మిట్ట–పెంచలకోన రహదారి క్రాస్‌ వద్ద ఉన్న విలువైన భూమికి సంబంధించిన రికార్డులు తారుమారు చేసి ఆక్రమించుకుని ఏకంగా గదులు నిర్మించి అద్దెకు ఇచ్చేశారు.

తిరుపతి రూరల్‌ మండలం పేరూరు గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 529/4ఎలో 0.98ఎకరాల ప్రభుత్వ భూమిని రాత్రికి రాత్రి చదును చేసి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టగా స్థానిక సర్పంచ్‌ దామినేటి కేశవులు, ఎంపీపీ మూలం చంద్రమోహన్‌రెడ్డి స్థానికులతో కలసి అడ్డుకున్నారు.

ఓటేరు గ్రామ పంచాయతీలో రజకులకు కేటాయించిన దోబీఘాట్‌ను ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే స్థానికులు అడ్డుకున్నారు.

గాంధీపురం పంచాయతీ పరిధిలోని హథీరాంజీ మఠం భూములు సర్వే నంబరు 13లో 1.09 ఎకరాల భూమిని టీడీపీ నేతలు ఆక్రమించగా స్థానిక సర్పంచ్‌ లక్ష్మి అడ్డుకున్నారు.

గాంధీపురం పంచాయతీ సర్వే నంబరు 13లో ఓ టీడీపీ నేత సుమారు రూ.4కోట్ల విలువైన 200 అంకణాల స్థలం ఆక్రమించి ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. ఆ సమయంలో గ్రామంలో గొడవలు జరిగినప్పటికీ రెవెన్యూ అధికారులు, పోలీసులు స్పందించలేదు.

చిగురువాడ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 274లో స్వర్ణముఖి నదిని ఆక్రమించి అతి పెద్ద షెడ్డు నిర్మాణం చేపట్టిన భూ ఆక్రమణదారులపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

దుర్గసముద్రం పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆక్రమంగా షెడ్లు, దుకాణాలను ఏర్పాటు చేసినా అధికారులు కన్నెత్తి చూడలేదు.

తనపల్లె వద్ద పద్మగిరి కొండ (సర్వే నంబరు 263)ను తవ్వి పచ్చనేతలు అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేస్తున్నారు. ఆ అక్రమ కట్టడాలకు అడ్డుగా వున్న ఓ నిరుపేద ఇంటి ప్రహరీ గోడను దౌర్జన్యంగా నేల కూల్చారు. ఆ బాధతో ఆ ఇంటి యజమాని రామచంద్రయ్య మంచం పట్టారు.

చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పరిధిలోని సర్వే నంబర్‌ 329లోని గ్రామ కంఠం భూమి, తిప్పిరెడ్డిగారిపల్లె పరిధిలోని గ్రామ కంఠం, దేవరకొండ పరిధిలోని సర్వే నంబర్‌ 586లో ఐదెకరాల గ్రామ కంఠం భూమి ఆక్రమించుకున్నా అడిగే నాథుడే కరువయ్యారు.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు, స్థలాలపై టీడీపీ నేతలు కన్నేశారు. ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమించుకుంటున్నారు. అనంతరం సదరు భూములు పదేళ్లుగా తమ అనుభవంలో ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి రెగ్యులరైజ్‌ చేయించుకుంటున్నారు. నివాస స్థలాలకు అనువుగా ఉండే భూములే లక్ష్యంగా టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. అందులో ఏర్పేడు మండల శ్రీనివాసపురం రెవెన్యూ పరిధిలో ఆక్రమణకు గురైన గ్రామ కంఠం భూమి ఒకటి. సర్వే నంబర్‌ 327లో 10.30 ఎకరాల గ్రామం కంఠం భూములు ఉన్నాయి. ఏర్పేడు– వెంకటగిరి రహదారికి సమీపంలో ఉండడం, గ్రామం పక్కనే ఐజర్‌ వంటి కేంద్రీయ విద్యా సంస్థలు ఉండడంతో ఆ భూములకు భారీగా డిమాండ్‌ పెరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు అని చెప్పుకుని తిరిగే వ్యక్తి ఒకరు శ్రీనివాసపురం పరిధిలోని గ్రామం కంఠం భూములపై కన్నేశాడు. ముందస్తుగా జంగాలపల్లె–శ్రీకాళహస్తికి వెళ్లే మార్గంలోని శివగిరిపల్లె వద్ద ఉన్న విలువైన రెండెకరాల భూమిని ఆక్రమించుకున్నాడు. గ్రామస్తులు నోరెత్తకుండా ఉండేందుకు కొందరితో రాయబారాలు గ్రామానికి రూ.2 కోట్లు ముట్టజెబుతామని ప్రలోభపెట్టాడు. అధికారం ప్రయోగంతో గ్రామస్తులను ఒప్పించాడు. గ్రామ కంఠం భూమిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తామని, ఎవరూ అడ్డుకోకూడదని, అభ్యంతరం చెప్పకూడదని అల్టిమేటం జారీ చేశాడు. ముందుగా రెండెకరాలను ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మకానికి పెట్టేశాడు. ప్రస్తుతం మార్కెట్‌ ధర ప్రకారం రెండెకరాల విలువ సుమారు రూ.6 కోట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

పద్మగిరి వద్ద తన స్థలంలోకి దారి కోసం టీడీపీ నేత

ధ్వంసం చేసిన ప్రహరీ గోడ

అడిగేదెవరు? ఆపేదెవరు?

పచ్చమూక ఆక్రమణల పర్వంలో మచ్చుకు కొన్ని.. 1
1/1

పచ్చమూక ఆక్రమణల పర్వంలో మచ్చుకు కొన్ని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement