
డీఎస్సీ అభ్యర్థులకు శాపం
డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులకు నార్మలైజేషన్ రూపంలో పెద్ద గండం ఎదురైంది. నార్మలైజేషన్‌తో ఉదయం షిఫ్ట్‌లో పరీక్ష రాసిన వారికి ప్రశ్నపత్రం సులువుగా, రెండవ షిఫ్ట్‌లో పరీక్షలు రాసిన వారికి కష్టంగాను రావడంతో ప్రతిభను కొలవలేం. – సుధాకర్‌రెడ్డి,
రిటైర్డ్ ఉపాధ్యాయులు, తిరుపతి
ఆన్‌లైన్ విధానంతోనే తిప్పలు
ఆఫ్‌లైన్ విధానంలో పరీక్షల నిర్వహణ జరిపి ఉండాల్సింది. ప్రస్తుతం నార్మలైజేషన్ ప్రక్రియలో విద్యార్థుల మార్కల గణనలో తేడాలు రావడంతో అయోమయం నెలకొంది. ఈ విషయాన్ని ప్రభుత్వ పరిగణలోనికి తీసుకోవాలి.
– సావిత్రమ్మ, ప్రైవేటు విద్యాసంస్థ
అధ్యాపకురాలు, తిరుపతి
అందరికీ న్యాయం చేయాలి
డీఎస్సీ అభ్యర్థులు ఎన్నో ఏళ్లు గా కష్టపడి పరీక్షలు రాశా రు. మార్కుల గణనలో నార్మలైజేషన్ ప్రక్రియతో చాలా మంది ప్రతిభగల అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక షిఫ్ట్‌లో పరీక్షలు రాసినవారే ఎక్కువ మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. పరిశీలించి అందరికీ న్యాయం చేయాలి. – సుదర్శన్ రావు,
విశ్రాంత అధ్యాపకులు, తిరుపతి

డీఎస్సీ అభ్యర్థులకు శాపం

డీఎస్సీ అభ్యర్థులకు శాపం