510 సెల్‌ఫోన్లు స్వాధీనం
తిరుపతి క్రైం : చోరీకి గురైన రూ.1.12 కోట్లు విలువ చేసే 510 సెల్‌ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. బుధవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి జిల్లాలో పోగొట్టుకున్న వారి సెల్‌ఫోన్ల కోసం ప్రత్యేకంగా జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన ‘మొబైల్ హంట్’ (పోలీస్ వాట్సాప్ నంబర్ 9490617873) అప్లికేషన్‌కు వచ్చిన ఫిర్యాదులపై గతంలో రూ.7.56 కోట్ల వి లువ చేసే 4,275 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామ న్నారు. తాజాగా 13 విడతలో 510 సెల్‌ఫోన్లను సైబ ర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారన్నారు. ప్రధానంగా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు సెల్‌ఫోన్లు పోగొట్టుకుంటున్నారని, అలాగే కొన్ని చోరీకి గురవుతున్నాయ ని తెలిపారు. అలాంటి వారంతా ‘మొబైల్ హంట్’కు హాయ్ అని మెసేజ్ చేస్తే లింకు వస్తుందని, అందులో వారి వివరాలను పూర్తి చేయాలన్నారు. సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్)లో ఇది నమోదవుతుందన్నారు. సెల్‌ఫోన్‌లో సమాచారం దు ర్వినియోగం కాకుండా ఆ ఫోన్ బ్లాక్ అవుతుందన్నా రు. దాని ద్వారానే సెల్‌ఫోన్లను రికవరీ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. రికవరీ చేసిన ఫోన్లన్నీ ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చామన్నారు. కేసును ఛేదించడంలో సైబర్ సీఐ వినోద్ కుమార్, సిబ్బంది ఎంతగానో కృషి చేశారన్నారు. అనంతరం సైబర్ సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేసి, అభినందించారు.


